మరోసారి ఎన్టీఆర్ తో కొరటాల శివ..

189
ntr koratala shiva

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడని సనీ వర్గాల సమాచారం. కొరటాల శివ త్వరలోనే చిరంజీవితో సినిమా చేయనున్నాడు. ఈసినిమాను 2020 దసరాకు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అప్పటి వరకూ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటుంది.

కాగా కొరటాల శివకు ఎన్టీఆర్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఎన్టీఆర్ చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది..