మ‌హానాయ‌కుడు క్లీన్ ‘U’ అందుకున్నాడు..

236
- Advertisement -

నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టించిన సినిమా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో రెండో భాగంగా వ‌స్తున్న‌ ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘U’ స‌ర్టిఫికేట్ అందుకుంది ఈ చిత్రం. ఫిబ్ర‌వ‌రి 22న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా.. ఎంఎం కీర‌వాణి సంగీతం అందించారు. నంద‌మూరి బాల‌కృష్ణ NBK ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాను నిర్మించారు.

NTR Mahanayakudu

నటీనటులు:నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్,రానా దగ్గుపాటి.. సాంకేతిక నిపుణులు:ద‌ర్శ‌కుడు: క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి,బ్యాన‌ర్స్: NBK ఫిల్మ్స్, వారాహి చ‌ల‌నచిత్రం, విబ్రి మీడియా, నిర్మాత‌: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌,సంగీతం: MM కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్, మాట‌లు: సాయి మాధ‌వ్ బుర్రా, లిరిక్స్: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహి సురేష్, క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: ఐశ్వ‌ర్య రాజీవ్, PRO: వ‌ంశీ శేఖ‌ర్.

- Advertisement -