ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఎన్టీఆర్ కసరత్తు..!

661
ntr
- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈసినిమా పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతోంది. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా కోసం హీరోలిద్దరు చమటోడుస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డంతో కొద్ది రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌కి బ్రేక్ ఇచ్చిన టీం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది.

rrr

ఇక కొమురం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. లాయిడ్ స్టీవెన్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన్నాళ్లుగా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. తాజాగా లాయిడ్‌ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్ లెగ్‌కి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేశాడు. ఈ ఫోటోకి కొమురం భీం, ఆర్‌ఆర్‌ఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌లతో ఎన్టీఆర్, రాజమౌళిలను ట్యాగ్ చేశాడు లాయిడ్‌. దీనికి ఎంతో కృషి చేశాం అని కామెంట్ కూడా పెట్టాడు. లాయిడ్ షేర్ చేసిన ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

- Advertisement -