ఓఎఫ్‌బీజేపీ… మీట్ అండ్ గ్రీట్ విత్ ఆర్‌పీ సింగ్

251
NRIS CAN MAKE A DIFFERENCE
- Advertisement -

ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ఆర్.పీ. సింగ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ప్రవాస బారతీయలకు, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం లో నెలకొన్న భద్రతా ఆందోళనలు, టెర్రరిజం, రానున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికల వ్యూహం,కార్య నిర్వహణ, మోడీ ప్రభుత్వ పథకాలను కార్యకర్తలకు వివరించారు. వీటితో పాటు ఢిల్లీ లోని ఆమ్ ఆద్మీ పార్టీ పాలన, మోసపూరిత విధానాలు, ప్రజా ధనం దుర్వియోగం, భారత దేశ ఐక్యత లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర, మరియు రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి కార్యకర్తలకు వివరించారు.

NRIS CAN MAKE A DIFFERENCE

భారత దేశ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు ఏవిధంగా భాగస్వాములు కావాలో వివరించారు ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల. దీంతో పాటు ఓఎఫ్ బిజెపీ విస్తరణ, భవిషత్తు కార్యాచరణ గురించి చర్చించారు. ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు జయేష్ పటేల్, చంద్రకాంత్ త్రివేది,బాల గార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవ గురించి చర్చించారు. ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్లు దీప్ భట్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువత చేసున్న అనేక కార్యక్రమాల గురించి తెలియజేశారు.

NRIS CAN MAKE A DIFFERENCE

ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ పార్తీబన్ వరదన్, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ సహా -కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, న్యూ జెర్సీలోని పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడారు. గుంజాన్ మిశ్ర, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గార్లు ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్యూహాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమం లో చాల మంది ప్రవాస భారతీయలు ఉత్సహంగా పాల్గొనగా…. ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ సహా-కన్వీనర్ ఆనంద్ జైన్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు.

- Advertisement -