‘నోటా’ మరింత లేటా..!

221
Nota Movie
- Advertisement -

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘నోటా’. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సీఎంగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మరో విజయాన్ని ఇస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ యూనిట్‌ ఉన్నారు. విజయ్‌కి జోడీగా మెహ్రీన్ .. సంచనా నటరాజన్ నటించారు. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాను, వచ్చేనెల 4వ తేదీన విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

Nota Movie

కానీ ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడంలేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడమే అందుకు కారణమని అంటున్నారు. ఈ కారణంగా ఈ సినిమాను దసరా కానుకగా వచ్చేనెల 18వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ డియర్ కామ్రెడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.

- Advertisement -