కరెంటుకు కొరత ఎక్కడిది..అవి తప్పుడు వార్తలు.??:ప్రభాకర్ రావు

479
transco cmd
- Advertisement -

ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించిన వార్తల్లో నిజం లేదని రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్యుత్ సమస్య లేదని ట్రాన్స్‌ కో,జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలపై స్పందించిన ఆయన సీఎం కేసీఆర్ వచ్చాక విద్యుత్ సంస్థల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 8వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా విద్యుత్ ఉత్పత్తి 11 వేల మెగావాట్లు ఉందన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు.

తెలంగాణ రాకముందు నాణ్యమైన విద్యుత్ రాక మోటర్లు కలిపోయేవని..పరిశ్రమలలో యంత్రాలు చెడిపోయేవని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. విద్యుత్ వ్యవస్థలో ఎక్కడ నష్టాలు ఉండవన్నారు. జీతాల గురించి కూడా కథనాలను ప్రచురించారు గుజరాత్‌తో పోల్చుకోవడం ఎందుకు ఎన్టీపీసీతో పోల్చుకుంటే సరిపోతుందన్నారు. సీఎస్ కు ఉన్న జీతం చీఫ్ ఇంజనీర్ సమాన వేతనం అని రాశారు ఇది పూర్తి అవాస్తవమన్నారు.

తాను విద్యుత్ సంస్థ నుండి తప్పుకుంటున్నట్లు వార్తలు ప్రచురించారు ఇందులో నిజం లేదన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెప్పారు. తమని సంప్రదించకుండా ఇలాంటి వార్తలను ప్రచురించడం సరికాదన్నారు. డిస్కంలలో ఎక్కడ కూడా డెడ్ బర్డెన్ లేదన్నారు.

సెప్టెంబర్, అక్టోబర్ లో విద్యుత్ వినియోగం వాడకం ఉంటుంది కాబట్టి విద్యుత్ ను పొదుపు కు 1000 మెగా వాట్స్ ఇచ్చామన్నారు. రాబోయే రోజుల్లో నాణ్యమైన24 గంటలు అందిస్తామని చెప్పిన ఆయన ప్రజలు ఎవ్వరు కూడా ఇలాంటి వార్తలు చూసి ఆందోళన చెందవదన్నారు.

- Advertisement -