న్యాయ వ్యవస్థే సుప్రీం : ప్రధాని మోడీ

334
modi
- Advertisement -

భారతదేశానికి న్యాయవ్యవస్థే సుప్రీం అని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. చట్టమనేది రాజులకే రారాజు.. చట్టమే అత్యున్నతమైనది తెలిపారు. ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోడీ …ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన న్యాయనిపుణులకు ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో సంక్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి న్యాయవ్యవస్థ కృషి చేస్తోందని… నిరంతరం అధ్యయనంతోనే కొత్త విషయాలు తెలుసుకోవచ్చన్నారు. వ్యవస్థలో మార్పులు హేతుబద్ధంగా, చట్ట ప్రకారం ఉండాలన్న మోడీ…. ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు.

మహాత్మాగాంధీ న్యాయవాది.. గాంధీ ఆచరించిన మార్గంతో న్యాయవ్యవస్థకు పునాది వేశారు. మహాత్మాగాంధీ తన జీవితాన్ని సత్యం, సేవా మార్గంలో కొనసాగించారని చెప్పారు. 70 ఏళ్ల భారత రాజకీయ వ్యవస్థలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాం. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ప్రముఖ దేశాల్లో భారత్‌ ఒకటి అని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -