అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు- ప్రభాకర్ రెడ్డి

427
prabhakar reddy
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 7వ తేదీన మున్సిపల్ మంత్రి కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్,వైస్ చైర్మన్ లతో సమావేశం నిర్వహించి నుడా, మున్సిపాలిటీ లను కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెన్ టేషన్ చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని.. నుడా పరిధిలోని అక్రమ లే అవుట్ ప్లాట్‌లకు ఎల్ ఆర్ ఎస్ ను 90 రోజుల లోపు చేయించుకోవాలి. ఇక నుండి నూతన వెంచర్స్ ను RERA రూల్స్ ప్రకారం లైసెన్స్ కలిగిన డెవలపర్ మాత్రమే చేయాలని..నుడా అడ్వైసర్ మెంబర్స్ తో చెరువుల సంరక్షణ కమిటీ, హరితాహర పర్యవేక్షణ కమిటీ, ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీలను వేయడం జరుగుతుంది అని ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

ఇప్పటి నుండి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లే అవుట్లలో వున్న సాంకేతిక సమస్యలను నుడా కార్యాలయంలో పరిష్కారం చేస్తాము. నుడా ఆధ్వర్యంలో సుమారు 50 ఏకరాల స్థలం తీసుకొని దానిని డెవలప్ చేసి అన్ని సదుపాయాలతో ప్లాట్‌లను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తామని నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -