వారణాసిలో పసుపు రైతుల నామినేసన్లు తిరస్కరణ

255
varanasi
- Advertisement -

పసుపుకు మద్దతు ధర,పుసుపు బోర్డు ఏర్పాటుకోసం కొంతకాలంగా నిజామాబాద్ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యను జాతీయ స్ధాయిలో వినిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసిలో నామినేషన్ వేసేందుకు పెద్దసంఖ్యలో రైతులు వారణాసి చేరుకున్నారు. ఈసందర్భంగా వారణాసిలో ప్రధానికి వ్యతిరేకంగా 35మంది రైతులు నామినేషన్లు వేశారు.

నిన్న రైతులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. రైతులు వేసిన నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేరంటూ వాటిని తిరస్కరించారు అధికారులు. దీంతో అనంతరం వారణాసి కలెక్టరేట్ వద్ద ధర్నకు దిగారు రైతులు.

అయితే వెలిగొండ సాధన సమితి అధ్యక్షుడు పూల సుబ్బయ్య మాత్రం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయగలిగారు. అలాగే కొల్లూరి కిరణ్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు. తమకు మద్దతిచ్చిన స్థానికులపై సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. ఈసీకి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- Advertisement -