వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో నితిన్

290
valmiki-nithin-cameo

మెగా హీరో వరుణ్ తేజ్ దర్శకుడు హరీష్‌ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నన మూవీ వాల్మీకి. తమిళ మూవీ ‘జిగర్తాండ’కి ఇది రీమేక్. ఈమూవీలో తమిళ హీరో అధర్వ మురళి ప్రధానమైన పాత్రలో కనిపించగా..పూజా హెగ్డె, మృణాళిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ చేయాలని అనుకున్నా అదే రోజున గ్యాంగ్ లీడర్ రిలీజ్ కి ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసుకున్నారు.

ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈసినిమాలో ఒక సర్ప్రైజ్ గెస్ట్ పాత్ర ఉందని.. ఆ పాత్ర కోసం హీరో నితిన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈసినిమాలో గెస్ట్ లో నటించాలని నితిన్ ను దర్శకుడు హరీష్ శంకర్ కోరగా నితిన్ వెంటనే ఒప్పేసుకోని షూటింగ్ కూడా పూర్తి చేశాడట.

తమిళ్ లో ఈపాత్రను హీరో విజయ్ సేతుపతి చేశాడు. నితిన్ తో పాటు ఈసినిమాలో డైరెక్టర్ సుకుమార్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈవిషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తమిళ్ లో భారీ విజయాన్ని సాధించిన ఈమూవీపై భారీ అంచనాలున్నాయి. 14రీల్స్ సంస్థ నిర్మించిన ఈమూవీని ఈనెల 20న విడుదల చేయనున్నారు.