‘భీష్మ’ తొలి రోజు వసూళ్లు

183

యంగ్ హీరో నితిన్ రష్మీక మందన జంటగా నటించిన చిత్రం భీష్మ. వెంకీ కుడుములు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈచిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. నితిన్ రష్మీకల జోడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

తెలుగురాష్ట్రాల్లో తొలి రోజున ఈ సినిమా 6.4 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 2.21కోట్ల షేర్ ను రాబట్టింది. అ ఆ మూవీ తర్వాత అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా భీష్మ నిలిచింది. ఇక రేపు ఎల్లుండి వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు సినీ విశ్లేషకులు. వరుస పరాజయాలతో సతమతమువుతున్న నితిన్ కు ఈ మూవీ కొంత ఉపశమనం కలిగించిందని చెప్పుకోవాలి.