నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష ఖరారు

523
Nirbhaya case
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది కోర్టు. ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. 7సంవత్సరాల క్రితం దేశ రాజధానిలో నిర్బయ ఆరుగురు మృగాళ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. 2012 డిసెంబర్‌ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మైనర్‌ సహా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఐతే ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మైనర్‌‌కు జువైనల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. అది పూర్తయిన అనంతరం అతడు 2015 డిసెంబర్‌ 20న విడుదలయ్యాడు. మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. విశేషం ఎంటి అంటే నిర్భయను హత్య చేసిన రోజే దోఘులకు ఉరి శిక్షను విధించింది. ఇటివలే హైదరాబాద్ లో జరిగిన దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో…నిర్భయ కేసుపై ఒత్తిడి పెరిగింది. ఏడు ఏండ్ల తర్వాత నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడటంతో దేశ వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -