రబీకి యూరియా సిద్ధం చేయండి-నిరంజన్ రెడ్డి

232
minister niranjan reddy

సోమవారం హాకాభవన్‌లో యూరియా సరఫరా అవుతున్న తీరుపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుండి రబీ సాగుకు సంబంధించిన సమాచారం సేకరించండి. ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే యూరియా సరఫరా త్వరితగతిన సాగేందుకు పోర్టు ఇంఛార్జ్,రైల్వే ఇంఛార్జ్ లతో సంప్రదింపులు జరపాలని.. గంగవరం, వైజాగ్, ట్యుటికోరిన్, కాకినాడ, కరైకల్, కృష్ణపట్నం పోర్టుల నుండి తెలంగాణకు వస్తున్న యూరియా గురించి ఆరాతియాలని అన్నారు.

niranjan reddy

హజీరా (గుజరాత్) క్రిబ్ కో యూనిట్, చెన్నై మద్రాస్ ఫర్టిలైజర్స్ నుండి తెలంగాణకు యూరియా చేరుకుంటుంది. అన్ని జిల్లాలకు చేరుకున్న యూరియా నిల్వల సమాచారం తెలుసుకోవాలి.ఆయా జిల్లాలలో కొంతమంది ప్రజాప్రతినిధులతో సంప్రదించి అదనపు అవసరాలు ఏమయినా ఉన్నాయేమో వివరాలు తీసుకోండని ఆయన తెలిపారు. ఈ రోజు నిజామాబాద్ కు 2, మిర్యాలగూడ, కరీంనగర్,సనత్ నగర్ ఒక్కో రేక్ ఈ రోజు చేరుకున్నాయి.

స్టాక్ పాయింట్లకు చేరుకున్న నిల్వల గురించి క్షేత్రస్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నెలలో ఇప్పటి వరకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా మొత్తం 64,485 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఇంకా రవాణాలో 33,205 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అదేవిధంగా వివిధ పోర్టులలో 7,800 మెట్రిక్ టన్నులు రవాణాకు లోడ్ అవుతుంది. వేరుశనగ సాగు క్రితం సారికన్నా ఈ సారి పెరగబోతుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.