యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నిను వీడని నీడను నేనే’

473
ninu veedani needanu nene
- Advertisement -

యువ హీరో సందీప్‌ కిషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్,రొమాన్స్‌ చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. సందీప్ కిషన్ సరసన ‌అన్యసింగ్‌ హీరోయిన్‌గా నటించగా వెన్నెల కిశోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు.

అది 2013 అనుకుంటా.. ఓ మిస్టరీ కేసు..సైన్స్‌కి మంచి ఆలోచింపజేసే కేసు అంటూ నటుడు మురళీ శర్మ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఇందులో సందీప్‌ కిషన్‌ ఏదో సమస్యతో బాధపడుతూ కనిపించారు. హీరోయిన్‌ అన్య సింగ్‌తో సందీప్ కిషన్ రొమాన్స్, తను నా రిషి కాదని ఆమె చెప్పే డైలాగ్… హీరో వర్షంలో తడుస్తూ ఏడుస్తుండటం ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.

అద్దంలో సందీప్ కిషన్ ముఖం చూసుకుంటే వెన్నెల కిషోర్ కనిపించడంతో ట్విస్ట్ ఇచ్చారు. చివరగా నిను వీడని నీడను నేనే అంటూ హర్రర్‌ చూపిస్తూ ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. ఈ సినిమా కోసం సందీప్ నిర్మాతగా మారడం విశేషం. ట్రైలర్‌ బాగుందని సందీప్‌కు బెస్ట్ విషెస్ చెప్పింది తమన్నా. మొత్తంగా ట్రైలర్‌తోనే హిట్ టాక్‌ సొంతం చేసుకున్న సందీప్‌ కిషన్‌ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -