సీక్వెల్ కోసం కార్తీకేయ సన్నిధిలో నిఖిల్..

259
Nikhil commences Kartikeya 2

స్వామిరారాతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన టాలీవుడ్ హీరో నిఖిల్. కార్తికేయ‌,ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సినిమాల తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరంగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన కార్తికేయ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ2లో నటించనున్నాడు.

ఐదేళ్ల క్రితం వచ్చిన కార్తికేయ మూవీ నిఖిల్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లింది. అందుకే మళ్లీ ఈ సినిమా సీక్వెల్‌పై దృష్టి సారించాడు. సవ్యసాచి ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుండగా చిత్రయూనిటట్‌తో కలిసి పళని కార్తికేయ స్వామిని దర్శించుకున్నారు నిఖిల్. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సవ్యసాచి అంచనాలు అందుకోకపోవడంతో చందూమొండేటికి కూడా కార్తికేయ సీక్వెల్ కీలకంగా మారింది. మరోవైపు నిఖిల్ కూడా వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. దీంతో వీరిద్దరూ కార్తికేయ సీక్వెల్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను కార్తికేయ 2 అందుకుంటుందా లేదా వేచిచూడాలి.