‘ఇస్మార్ శంకర్’.. దిమాక్ ఖరాబ్ చేస్తున్న నిధి అగర్వాల్

284
Nidhhi Agerwal
- Advertisement -

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో దిమాక్ ఖరాబ్... అనే సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తోన్న ఈ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రాశారు. ఈ సాంగ్ తెలంగాణ యాసలో సాగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగర్వాల్ స్టిల్‌ను విడుదల చేశారు. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ సెట్‌ను డైరెక్టర్ సుకుమార్ విజిట్ చేసి సరికొత్త స్టైల్లో ఉన్న రామ్ లుక్‌ను, సాంగ్ మేకింగ్ ను అప్రిషియేట్ చేశారు.

- Advertisement -