10 కోట్లు ఇస్తామన్న కనికరం చూపలేదు..!

220
Jayaram murder case
- Advertisement -

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులు రాకేశ్ రెడ్డి,శ్రీనివాస్‌ల మూడురోజుల కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. జయరాం హత్య కేసు వెనుక దాదాపు రూ.150 కోట్ల ఢీల్ ఉన్నట్లు గుర్తించారు.

జయరాంతో బలవంతంగా బాండ్ పేపర్‌లపై సంతకాలు చేయించుకున్న నిందితులు ఆస్తులను వివాదంలోకి లాగి కనీసం 150 కోట్ల వరకు సంపాదించాలనే భారీ కుట్ర పన్నారు.ఈ భారీ స్కెచ్ వెనుకాల రాకేశ్ ఒక్కడే ఉన్నాడా? జయరాం బంధువుల పాత్ర ఉన్నదా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

అయితే తనను చంపకుండా ఉంటే రూ. 10 కోట్లు ఇస్తానని జయరాం బతిమిలాడిని నిందితులు వినిపించుకోలేదు. జయరాంను అంతమొందించేందుకు కొందరు పోలీసులు, రౌడీషీటర్లు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులతో సంప్రదించినట్టు విచారణలో తేలింది. తాము వేసిన స్కెచ్‌ పక్కగా అమలైతే ఒక్కొక్కరికి కోటీ నుండి ఐదు కోట్లు దక్కేలా ఒప్పందాలు చేసుకున్నారు.

ఒక్క హత్యతో జీవితంలో సెటిల్‌ అయ్యేలా చేస్తానంటూ విశాల్, నగేశ్, శ్రీనివాస్‌ను నిందితులు నమ్మించినట్టు పోలీసుల విచారణలో తేలింది. జయరాం మేనకోడలు శిఖాచౌదరి పాత్రపై కూడా పోలీసులు లోతైనా దర్యాప్తు జరుపుతున్నారు. ఇక ఈ కేసులో పోలీసుల పాత్రపై కూడా పలు ఆధారాలు సేకరించిన ఉన్నతాధికారులు మరికొంతమందిపై వేటువేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జయరాం ఇంటి నుండి కంపెనీ షేర్ల పత్రాలను శిఖా తీసుకెళ్లారని భావిస్తున్న పోలీసులు ఈమేరకు ఆమెను ప్రశ్నించి వివరాలు రాబట్టారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందని, విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ అంజన్ కుమార్ తెలిపారు.

- Advertisement -