గవర్నర్‌గా తమిళసై ప్రమాణ స్వీకారం..

270
Tamilisai Soundararajan

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే.. నేడు తెలంగాణ గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిచనున్నారు. ఈ నేపథ్యంలో తమిళసై ఈ రోజు ఉదయం 11.00 గంటలకు తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ రాజ్‌భవన్‌లో తమిళసై సౌందరరాజన్‌తో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

Tamilisai Soundararajan

ఇప్పటికే దాదాపు నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, తొలి రోజే సౌందరరాజన్.. సాయంత్రం తెలంగాణ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే టీ-సర్కార్ సౌందరరాజన్‌కు అందించింది.