చెల్లెలి పెళ్లిలో నాగశౌర్య సందడి.. వీడియో

613
Naga Shaurya
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అశ్వ‌థ్థామ‌`. ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.ఈ చిత్రంలో మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 31న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగశౌర్య, ఈ సారి యాక్షన్ ను ఎక్కువగా టచ్ చేస్తూ ‘అశ్వద్ధామ’ సినిమా చేశాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు.

“మహి .. చూస్తుంటే నువ్వలా .. అందాల బొమ్మలా ..” అంటూ ఈ పాట సాగుతోంది. చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపిస్తూ, ఆ సంబరాన్ని అందరితో కలిసి పంచుకునే అన్నయ్యగా ఈ పాటలో నాగశౌర్య కనిపిస్తున్నాడు. పూజన్ కోహ్లీ ఆలాపన .. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. విశ్వరఘు కొరియోగ్రఫీని అందించిన ఈ సాంగ్ స్క్రీన్ పై మంచి సందడి చేస్తుందనే అనిపిస్తోంది.

https://youtu.be/naAf5Lvp90Y

- Advertisement -