ఈ బుడ్డోడు.. సచిన్‌ 2.0 !

209
New Sachin Tendulkar In The Making?
New Sachin Tendulkar In The Making?
- Advertisement -

క్రికెట్లో తరచుగా సంచలనాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఐదేళ్ల ఓ బుడతడు పెద్దవాళ్లతో పోటీగా క్రికెట్ ఆడితే.. అది ఓ పెద్ద సంచలనమే. అచ్చం సచిన్‌ను తలపిస్తూ చేసే బ్యాటింగ్‌ నిజంగా అధ్బుతమనే చెప్పాలి. నిజానికి సచిన్ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 15 ఏళ్లకే అరంగేట్రం చేశాడు. ఐదేళ్లకే అండర్-14 జట్టులో స్థానం సంపాదించాడు ఢిల్లీకి చెందిన రుద్ర ప్రతాప్ అనే బుడ్డోడు. ఈ బుడ్డొడు సచిన్ జిరాక్స్‌లా కనిపిస్తున్నాడు. ఐదేళ్ల వయస్సులోనే ఢిల్లీ అండర్-14 జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు.

రుద్ర ప్రతాప్ 2014లో జరిగిన అండర్-14 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియే ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టుపై అతడి బ్యాటింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడి మ్యానరిసమ్స్, బ్యాటింగ్ స్టైల్, టెంపర్‌మెంట్, షాట్ల ఎంపిక చూస్తుంటే అచ్చు సచిన్‌లానే అనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూస్తున్నంత సేపు రుద్ర స్టాన్స్, తనకన్నా 10 ఏళ్ల పెద్ద వాళ్లైన బౌలర్లతో వ్యవహరించిన తీరు, సహచరులు ఔట్ అవుతున్నా క్రీజ్‌లో మనోధైర్యంతో నిలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు వీడు ‘సచిన్ 2.0’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక రుద్రకు సరిపోయే క్రికెట్ కిట్ లేదు. అందుకోసం ముందుగా టోపి పెట్టుకొని.. టోపి పైన హెల్మెట్ పెట్టుకున్నాడు. తొడలకు కట్టుకునే థై ప్యాడ్స్‌ను చెస్ట్‌ గార్డుగా పెట్టుకున్నాడు. ఇక రుద్ర బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు సింగిల్స్‌ కోసం ప్రయత్నించలేదు. రుద్రకు తన వికెట్‌ను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలుసంటూ కామెంటేటర్లు వ్యాఖ్యానించారు. అయితే రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియోలో రుద్ర ప్రతాప్‌ కనబరిచిన పరిణతి ముచ్చట గొలుపుతోంది.

https://youtu.be/n6jBv0c_lS0

- Advertisement -