వినాయక చవితికి ‘శైలజా రెడ్డి అల్లుడు’..!

261
Shailaja Reddy Alludu
- Advertisement -

నాగచైతన్య అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు.

Shailaja Reddy Alludu

దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రావడం లేదు. ‘వినాయక చవితి’ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. అదే రోజున సమంత ‘యూ టర్న్’ సినిమా విడుదలవుతోంది.

- Advertisement -