రోహిత్..రెజీనా కెమిస్ట్రీ అదుర్స్‌

219
new look of regina romance with Nara Rohit
- Advertisement -

హిట్ అండ్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో ‘నారా రోహిత్’.  తాను ఎన్నుకున్న కధల్లో బలం ఉందా లేదా అనేది మాత్రమే చూసే   రోహిత్ తాజాగా బాలకృష్ణుడుగా ప్రేక్షకుల ముందుకువచ్చాడు.  రోహిత్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నారు.ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరిలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

రెజీనా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని తెలుస్తోంది.సినిమాలో ప్రతి సన్నివేశంలో రెజీనా అందాలు చాలా కొత్తగా ఉంటాయట. ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ చూస్తుంటే.. సినిమాలో రెజీనా అండ్ రోహిత్ కెమిస్ట్రీ అదిరిపోయిందని అర్ధమవుతోంది.

నారా రోహిత్ తో రొమాన్స్ రెజీనా మాత్రం కొంచెం గట్టిగానే చేసిందనే మరో టాక్ వినిపిస్తోంది. రొమాన్స్ సీన్స్‌లో ఇద్దరూ కుమ్మేశారట. సినిమా హిట్‌పై రోహిత్ గట్టి  నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమాతో రెజినాకు మాత్రం చాలా అవసరం. రోహిత్‌ గత చిత్రాలకి భిన్నంగా సాగే ఈ చిత్రానికి జగపతిబాబు వాయిస్‌ ఓవర్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కెరీర్‌లో తొలిసారి నారా రోహిత్‌  సిక్స్‌ప్యాక్‌తో కనిపించనుండగా రమ్యకృష్ణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

- Advertisement -