కొత్త హీరోయిన్లతో బోయపాటి..!

172
boyapati balakrishna

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనివాస్ కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె పూజా కార్యక్రమాలు జరుగగా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఏకంగా 15 కిలోలు తగ్గిన బాలయ్య నయా లుక్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య సరసన హీరోయిన్‌గా తొలుత నయనతారను సంప్రదించారని కానీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె నో చెప్పిందంట. తర్వాత శ్రీయను సంప్రదించగా ఆమె కూడా అంతగా ఆసక్తిచూపలేదట.

దీంతో తన సినిమాలో కొత్త హీరోయిన్లను తీసుకోవాలనే నిర్ణయానికి బోయపాటి వచ్చారట. సాధారణంగా కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించే విషయంలో బాలకృష్ణ ఆలస్యాన్ని ఎంతమాత్రం సహించరు. అలాంటిది హీరోయిన్ ఎంపిక విషయంలో జరుగుతున్న ఆలస్యంపై గుర్రుగా ఉన్న బాలయ్య సైతం కొత్త హీరోయిన్లను తీసుకోవాలని సూచించారట. మొత్తంగా ఇప్పుడు ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.