టీమిండియాకు కొత్త కోచ్‌:బీసీసీఐ

296
bcci
- Advertisement -

టీమిండియాకు కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవికాలం ప్రపంచకప్‌తోనే ముగియడంతో ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వకుండా కొత్త కోచ్ ఎంపికలో పడింది బీసీసీఐ.

సీనియ‌ర్‌ పురుషుల క్రికెట్ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌, బ్యాటింగ్ కోచ్‌, బౌలింగ్ కోచ్‌, ఫీల్డింగ్ కోచ్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, స్ట్రెంగ్త్ అండ్ కండిష‌నింగ్ కోచ్‌, అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు బీసీసీఐ తెలిపింది.

త్వ‌ర‌లో టీమిండియా వెస్టిండీస్‌ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న నేప‌థ్యంలో శాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కాంట్రాక్ట్‌ను మరో 45 రోజులు పొడిగించారు. టీమిండియా కొత్త కోచ్‌ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -