మార్కెట్లోకి కొత్త 500నోట్లు…

197
- Advertisement -

పాత నోట్లను రద్దు చేసిన క్రమంలో ఇప్పటికే ఆర్బీఐ 2వేల నోట్ ను విడుదల చేసింది. తాజాగా 5వందల నోట్లను కూడా బ్యాంకుల్లోకి రిలీజ్ చేసింది. ఈ నోట్లును మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఆదివారం పంపిణీ చేసింది. ఢిల్లీ, ముంబై, భోపాల్ నగరాల్లోని బ్యాంకులకు ఇప్పటికే కొత్త 500నోట్లు చేరుకున్నాయి. ఎస్‌బీఐ ఏటీఎంల్లో కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వచ్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. మరి కొద్ది గంటల్లోనే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ ఈ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. పూర్తి స్థాయిలో ముద్రణాలయాలు పనిచేస్తున్నాయని, డిమాండ్‌కు తగినట్టుగానే పాత నోట్ల స్థానే కొత్త నోట్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఎలాంటి సమస్యా లేదని,.. రెండు వారల క్రితమే రూ.500 కొత్త నోట్ల ముద్రణ ప్రారంభమైంది ఆర్‌బీఐ తెలిపింది.

NEW 500RUPESS NOTE

నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి 5వందల నోట్లు చలామణిలోకి వస్తున్నవి. ఈ నోట్లు స్టోన్ గ్రే కలర్ లో ఉన్నాయి. ఈ రోజు 50 లక్షల 500ల నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. 16న మరో 50 లక్షల 5వందల నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. కొత్త ఐదువందల నోట్ల రాకతో ప్రజల కష్టాలు తీరనున్నాయి.

NEW 500RUPESS NOTE

ఏటీఎంలలో పాత నోట్లను తొలగించి కొత్త నోట్లతో నింపుతున్నామని, ఈ మొత్తం ప్రక్రియకు తక్కువలో తక్కువగా రెండు వారాలు పడుతుందన్నారు. ప్రజలు సహనం వహించాలని, పరిస్థితులు మళ్లీ త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 50 రోజుల సమయం ఉందని ఆయనపేర్కొన్నారు.

- Advertisement -