‘నీ జతలేక’ రివ్యూ

243
- Advertisement -

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, పారుల్‌, సరయు హీరో,హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నీ జతలేక’.వరుస విజయాలతో పరిశ్రమలోని నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారిన నాగ శౌర్య….నీ జతలేకతో మెప్పించాడో లేదో చూద్దాం.

కథ:

హీరో అఖిల్ (నాగ శౌర్య) బాగా డబ్బున్న స్వప్న (సరయు)తో ప్రేమలో పడతాడు. ఎప్పుడు గొడవపడే వీరిద్దరూ విడిపోతారు. తిరిగి కలుసుకునేందుకు ఓ ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో తన ప్రేమను చక్కదిద్దుకునే పనిలో పడతాడు. ఇందుకోసం ఫ్రెండ్ లవర్‌ (పరుల్) ని హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ అనుకోకుండా అఖిల్, పరుల్ ఇద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత ఏం జరిగింది..చివరకు ఏం జరుగుతుందనేదే నీ జతలేక.

ప్లస్ పాయింట్స్ :

సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తు ప్రేక్షకులను మెప్పిస్తున్న నాగశౌర్య నీ జతలేకతో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ పరుల్ తన పాత్రలో అందంగా కనిపిస్తూ చాలా బాగా నటించింది. సెకండాఫ్ లో లవ్ స్టోరీలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉండి ఆకట్టుకున్నాయి.పాటలు చిన్నవే అయినా వాటిలోని సంగీతం బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ, దర్శకుడు.సినిమా కథ కూడా చాలా పాతదిగా ఉండటంతో తరువాతి సీన్ ను సులభంగా ఊహించేయొచ్చు. చాలా సన్నివేశాల్లో ప్రధాన పాత్రలు తేలిపోయాయి.కొన్ని సన్నివేశాల్లో ప్రేమికులుగా ఉండి మరికొన్ని సన్నివేశాల్లో స్నేహితులనడం చూస్తే దర్శకత్వ లోపం ఎంతలా ఉందో తెలిసిపోతుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు లారెన్స్ దాసరి విషయానికొస్తే దర్శకుడిగా అతని పనితనం బాగోలేదు. మామూలు ప్రేమ కథని సూటిగా సుత్తిలేకుండా చెప్పాల్సింది పోయి మధ్యలో అనవసరమైన సన్నివేశాలను, అంశాలను కలిపి బోరింగ్ సినిమా తీశారు. సంగీతం చాలా బాగుంది. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ పరవాలేదనిపించే స్థాయిలోనే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘చందమామ కథలు,ఊహలు గుసగుసలాడే’ లాంటి చిత్రాల కంటే ముందు తెరకెక్కిన చిత్రం నీజతలేక. సినిమా పూర్తైన చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత కథ, బోరింగ్ కథనంతో సినిమా అలా అలా సాగిపోయింది. మొత్తంగా నాగశౌర్య అభిమానులకు కాస్త నిరాశకలిగించే నీ జతలేక.

విడుదల తేదీ : 01/10/2016
రేటింగ్ : 2/5
నటీనటులు : నాగ శౌర్య, పరుల్ గులాఠి
సంగీతం : స్వరాజ్ జెడిదయ్య
నిర్మాత : జి వి చౌదరి
దర్శకత్వం : లారెన్స్ దాసరి

- Advertisement -