వైరల్ అవుతున్న NBK105 లుక్‌..!

429
balakrishna
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం థాయ్‌లాండ్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో హ్యాపీమూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇది వరకు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. గడ్డం, మీసం ఉన్న లుక్‌లో బాలయ్యను చూసి థ్రిల్ అవుతున్నారు.

balaiah

ఈ ఫోటోలు అభిమానులకు కిక్ ఇచ్చాయి. బాలయ్య లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెంచ్ గడ్డంతో బాలయ్య కొత్తగా ఉన్నారు. వయసు 20 ఏళ్ళు తగ్గిపోయింది. చాలా యాంగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతున్నది. మంగళవారం నుండి లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సినిమాలో కీలకమైన భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.

సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్,భూమిక చావ్లా, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా.. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

- Advertisement -