NBK105.. ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాలయ్య..

525
balakrishna
- Advertisement -

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాలో బాల‌కృష్ణ పాత్ర‌కు సంబంధించిన మ‌రో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

NBK105

ఈ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాల‌కృష్ణ ర‌క్తం అంటిన క‌త్తిని పట్టుకుని ఉన్నారు. ముఖం అంతా రంగుల‌తో నిండి ఉంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబ‌ర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ను వేశారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు:నందమూరి బాలకృష్ణ,సోనాల్ చౌహాన్,వేదిక,ప్రకాశ్ రాజ్,భూమిక చావ్లా,జయసుధ,షాయాజీ షిండే,నాగినీడు,సప్తగిరి,శ్రీనివాస్‌రెడ్డి,రఘుబాబు,ధన్‌రాజ్ తదితరులు.

- Advertisement -