‘జైసింహా’ ట్రైలర్ అదుర్స్..

270
NBK 102 'Jai Simha' Trailer
- Advertisement -

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం జైసింహా. కేఎస్ రవికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నఠాషా దోషి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్‌ని విడుద‌ల చేసి మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది చిత్ర యూనిట్‌. ఇక‌ చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.

NBK 102 'Jai Simha' Trailer

సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ రాజ్యం, సింహా చిత్రాల‌లో క‌లిసి ప‌నిచేసిన బాల‌య్య‌, న‌య‌నతార ముచ్చ‌ట‌గా మూడోసారి జై సింహాతో జ‌త‌క‌ట్టారు. జై సింహా చిత్ర ట్రైల‌ర్‌ని ఆడియో వేడుక‌లో మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

‘జై సింహా’ ఆడియో ఫంక్షన్ అందరినీ కలిపిన ఓ మహాసభ అని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ‘జై సింహా’ ఆడియో సీడీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎన్నో గొప్ప వేషాలు చేసిన ఘనత తన తండ్రి ఎన్టీఆర్ ది అయితే, అలాంటి వేషాల్లో నటించే గుణం తనకు అబ్బిందని, తాను నటించిన పాత్రలన్నింటికి న్యాయం చేశానో లేదో చెప్పేది అభిమానులు మాత్రమేనని అన్నారు.

- Advertisement -