రూ.1500 కోట్ల మూవీలో…మరోసారి వెండితెర సీతగా నయన్‌..!

234
nayanathara

టాలీవుడ్‌లో భారీ పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టింది గీతా ఆర్ట్స్‌. దంగల్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తుండగా మధు మంతెన,ప్రైమ్ ఫోకస్‌,నమిత్ మల్హోత్రా సహ నిర్మాతలుగా ఉన్నారు. రూ. 1500 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామాయణ్ అనే టైటిల్ ఖరారు చేయగా మూడు పార్టులుగా తెలుగు,తమిళ,హిందీ భాషలలో విడుదల కానుంది.

ఇక ఈ మూవీలో సీతగా నయనతార నటించనుందనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో శ్రీరామరాజ్యం మూవీలో వెండితెర సీతగా అలరించింది నయన్‌. తాజాగా మరోసారి ఆమెకే ఆ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మూడు భాగాలుగా తెరకెక్కించనున్న ఈ రామాయణం చిత్ర తొలి భాగాన్ని 2021లో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.