ఎనిమిదోసారి…బీజేడీ చీఫ్‌గా నవీన్ పట్నాయక్

140
naveen patnaik

బీజూ జనతాదళ్‌(బీజేడీ) చీఫ్‌గా ఎనిమిదోసారి ఎన్నికయ్యారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది.

గ్రామ పంచాయతీ కమిటీ సభ్యుల నుంచి రాష్ట్రస్థాయి అధ్యక్షుల వరకు బీజేడీ సంస్థాగత ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో కొనసాగాయి. ఫిబ్రవరి 21వ తేదీన పార్టీ 33 జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది. వీరిలో 14 మంది పాతవారే తిరిగి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవ్వగా.. కొత్తగా 19 మంది జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

ఇటీవల జరిగిన ఒడిశా ఎన్నికల్లో ఐదోసారి బీజేడీని అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యారు నవీన్‌. 112 సీట్లు సాధించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.ఇప్పటివరకూ పశ్చిమ బెంగాల్‌లో జ్యోతిబసు, సిక్కింలో పవన్ చామ్లింగ్ మాత్రమే ఐదుసార్లు సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడో సీఎంగా నవీన్ పట్నాయక్ చరిత్ర సృష్టించారు.