జులై 15 న నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్

85
Gangleader

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ‘నాని గ్యాంగ్ లీడర్’ ప్రీ లుక్ పోస్టర్ నేడు విడుదల చేశారు. ‘నేను గ్యాంగ్ లీడర్… మా గ్యాంగ్ రెడీగా ఉంది…’ అని నాని ప్రీ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సినిమా సబ్జెక్టు కి అనుగుణంగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తి రేపేలా ఉండి మంచి రెస్పాన్స్ రాబట్టింది.

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్జు ని జూలై 15 న విడుదల చేయనున్నారు. అలాగే ఫస్ట్ సాంగ్ ని జులై 18 న, టీజర్ ని జులై 24 న రిలీజ్ చేయనున్నారు. సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.