ట్యాక్సీవాలా దర్శకుడితో నాని

519
Nani Taxiwala
- Advertisement -

నేచురల్ స్టార్ ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే చిత్రంలో నటిస్తున్నారు. మూవీలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈమూవీలో నాని విలన్ గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఎప్రిల్ లో ఈ మూవీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈమూవీ తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని తర్వాతి మూవీ నిన్నుకోరి సినిమా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు.

nani

ఈసినిమాకు టక్ జగదీశ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. కొద్ది రోజుల క్రితం ఈమూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. తాజాగా నాని మరో సినిమాకు సైన్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. విజయ్ దేవరకొండతో ట్యాక్సివాలా సినిమా తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ నానికి కథ వినిపించాడట. రాహుల్ వినిపించిన కథ నాని నచ్చడంతో పూర్తి కథను సిద్దం చేయమని చెప్పాడని తెలుస్తుంది. ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను కూడా నాని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -