“మజిలీ” దర్శకుడితో నాని

332
Ninnu_Kori
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. మొదట ఆగస్ట్ 30విడుదల చేద్దామని ప్రకటించినా..ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా విడుదల కానుండటంతో గ్యాంగ్ లీడర్ ను వాయిదా వేసుకున్నారు.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక చిత్రం తర్వాత నాని మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమా చేయనున్నాడు. ఇటివలే ఈచిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించగా… హీరో సుధీర్ బాబు ఈమూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

shiva-sam-chai

ఇక నాని తర్వాతి మూవీని కూడా లైన్ లో పెట్టినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దర్శకుడు శివ నిర్వాణ ఇటివలే నానిని కలిసి ఒక స్టోరీ వినిపించాడట. నానికి కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. శివ నిర్వాణ నానితో నిన్నుకోరి సినిమా తెరకెక్కించారు. ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ‘మజిలీ’ సినిమాతోను శివ నిర్వాణ తన సత్తా చాటుకోవడం వలన వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

- Advertisement -