యువ దర్శకుడితో నాని..

125
nani

న్యాచురల్ స్టార్ జెర్సీ మూవీ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈసినిమా తర్వాత నాని ఇంద్రగంటి మోహనకృష్ణతో మల్టీస్టారర్ సినిమా చేయనున్నాడు. ఈమూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. తాజాగా నాని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

కల్కి సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ నానిని కలిసి ఓ స్టోరీని వినిపించాడట. లైన్ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో కల్కి సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ గతంలో తెరకెక్కించిన అ! సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈసినిమా మంచి విజయాన్ని సాధించగా..బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.