V లో నాని సిక్స్ ప్యాక్..

629
nani sixpack
- Advertisement -

విభిన్న కథలను ఎంచుకుంటు వరుస హిట్లతో జోష్ మీదున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికి తాను 23మూడు సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 24వ సినిమా గ్యాంగ్ లీడర్. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా విడుదలకు రెడీగా ఉంది.

విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈసినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈసినిమా తర్వాత నాని మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేయనున్నారు. ఈసినిమాకు వి అనే టైటిల్ కు ఖరారు చేశారు. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించగా..హీరో సుధీర్ బాబు విలన్ గా నటించనున్నాడు.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో నాని సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే నాని జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈమూవీలో నాని సరసన నివేదా థామస్ .. అదితీరావు హైదరీలు హీరోయిన్లుగా నటించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

- Advertisement -