రివ్వూః నాని గ్యాంగ్ లీడర్

417
Gang Leader Review

నేచురల్ స్టార్ నాని ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్.కె కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. పూర్తి వినోదభరితంగా తెరకెక్కిన ఈచిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని సరసన హీరోయిన్ గా ప్రియా అరుళ్ మోహన్ నటించగా, లక్ష్మీ, శరణ్య , ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్ఎక్స్ 100హీరో కార్తికేయ ఈమూవీలో విలన్ గా నటించారు. అసలు ఈసినిమా కథేంటీ? నాని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడు? గ్యాంగ్ లీడర్ సినిమా ఎలా ఉందో చూద్దాం?

కథః

పెన్సిల్ పార్థసారథి (నాని) ఫేమస్ రివేంజ్ రైటర్. అలాంటి వాడి దగ్గరికి ఐదుగురు ఆడవాళ్లు వస్తారు. అందులో 80 ఏళ్ల బామ్మ (లక్ష్మి), 50 ఏళ్ల అమ్మ (శరణ్య), 22 ఏళ్ల అమ్మాయి ప్రియ (ప్రియాంక మోహన్), 17 ఏళ్ల టీనేజర్, నాలుగేళ్ళ పాప (ప్రాణ్య) ఉంటారు. పెన్సిల్ పుస్తకాల్లో ఉండే పగను నమ్మి.. తమ పగకు సాయం చేయమని ఆయన దగ్గరికి వస్తారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. పెన్సిల్ రోజు వారీగా జరిగే సంఘటనలన్నింటిని ఒక బుక్ గా రాసి పెట్టాలని ఆయన ఆలోచన. అసలు నానికి బుక్ లకి ఉన్న సంబంధం ఎంటీ? ఆ ఐదుగురు ఆడవాళ్లతో పెన్సిల్ కు ఉన్న అనుబంధం ఎలాంటింది? విలన్ కార్తికేయపై ఆ నలుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ ప్రతికారం ఎందుకు తీసుకున్నాడో తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ః

విక్రమ్ కుమార్ కథను చాలా బాగా రాసుకున్నాడని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లో గా సాగిన కార్తికేయ(విలన్ ) ఎంట్రీ తర్వాత సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక సెకండ్ ఆఫ్ సినిమాకి హైలెట్ అని చెప్పుకోవాలి. కొన్ని ఎమోషన్స్‌ ప్రేక్షకులను తట్టే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది. ఇక చిన్న నాని, ప్రియ లవ్ ట్రాక్ ఉండాలన్నట్టు ఉంటుంది. లక్ష్మీకి సంబంధించిన చిన్న ట్విస్టు సినిమాపై ఆసక్తి రేపుతుంది. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో రొటీన్‌గా క్లైమాక్స్ ముగుస్తుంది. సెకండ్ ఆఫ్ లో ట్వీస్ట్ లతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈసినిమాలో నటించిన వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య , లక్ష్మీ పలువురు నటీనటులు అద్భుతంగా నటించారు.

మైనస్ పాయింట్స్ః

ఫస్ట్ ఆఫ్ కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ ఆఫ్ కొంచెం బోరింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ మాములు అందరూ ఉహించినట్లు గానే కథలో బలం లేకపోవడం మైనస్ గా చెప్పుకోవచ్చు.. ఈసినిమాకు స్క్రీన్ ప్లే పై కొంచెం వీక్ గా ఉంది.

సాంకేతిక విభాగం:

నాని గ్యాంగ్ లీడర్ పాయింట్ బాగున్నప్పటికీ.. కథ, కథనాలు ఇంప్రెసివ్‌గా లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పవచ్చు. నటీనటుల ఫెర్ఫార్మెన్స్ మాత్రమే ఈ సినిమాను కాస్తో కూస్తో నిలబెట్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరవయ్యే సినిమాలు లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఆ వర్గం ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడానికి అవకాశం ఉంది.

విడుదల తేదీః 13/09/2019
రేటింగ్ః 2.5/5
నటీనటులుః నాని, ప్రియా అరుళ్ మోహన్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, లక్ష్మీ, రఘుబాబు
సంగీతంః అనిరుథ్ రవిచంద్రన్
నిర్మాణంః మైత్రి మూవీ మేకర్స్
దర్శకత్వంః  విక్రమ్ కుమార్.కె