సెప్టెంబర్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని

497
gang-leader
- Advertisement -

నేచురల్ స్టార్ నాని మరో సారి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. నాని నటించిన అష్టా చమ్మా, భలే భలే మగాడివోయ్ సినిమాలు సెప్టెంబర్ నెలలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈసారి కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు నాని. గ్యాంగ్ లీడర్ మూవీని మొదట ఆగస్ట్ 30న విడుదల చేయాలని అని నిర్ణయించుకున్నారు.

కానీ ఆరోజు ప్రభాస్ నటించిన సాహో చిత్రం విడుదల అవుతుండటంతో గ్యాంగ్ లీడర్ ను వాయిదా వేసుకున్నారు. నానికి కలిసోచ్చిన సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.

విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనిరుథ్ సంగీతం అందించారు. నాని సెప్టెంబర్ సెంటిమెంట్ గ్యాంగ్ లీడర్ కు వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.

- Advertisement -