సినిమా సూపర్ హిట్ అయితే నిద్రలేపండిఃనాని

191
Nani

నేచురల్ స్టార్ నాని ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈమూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమూవీలో నాని రైటర్ పార్ధసారధి పాత్రలో కనిపించనున్నాడు. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని 14రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మించారు.

ఇక ఈసినిమా చూసిన ప్రేక్షకులు చాలా బాగుంది అంటూ చెబుతున్నారు. నాని రైటర్ పాత్రలో అలరించాడని స్పష్టం చేశారు. ఇక నాని ఈరోజు ఉదయం తన ట్వీట్టర్ ద్వారా ఓ పోస్ట్ చేశాడు. సినిమా సూపర్ హిట్ అయితే నిద్రలేపండి. లేదంటే డిస్టర్బ్ చేయవద్దు’ .. ఈచిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా..అని సీనియర్ నటి లక్ష్మితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఈ సినిమాలో లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిళ్లా ప్రధాన పాత్రలు పోషించగా, ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు.