శిరీష్‌ స్టార్ డ‌మ్‌ ‘ABCD’తో స్టార్ట్ అవ్వాలి- నాని

292
ABCD movie pre-release
- Advertisement -

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్‌ ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. నేచుర‌ల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా.. నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ – “నాకు ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే పిల్ల జ‌మీందార్ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమాను మంచి హిట్ ఏబీసీడీ సినిమా కావాల‌ని కోరుకుంటున్నాను. మ‌ధుర‌శ్రీధ‌ర్‌ నాకు మెసేజ్ చేసి చీఫ్ గెస్ట్‌గా ర‌మ్మ‌న్నారు. ఆయ‌నంటే నాకు చాలా ఇష్టం. ఆ కార‌ణంగా ఈ వేడుక‌కి వ‌చ్చాను. శిరీష్‌లో ఓ చిన్న‌పిల్లాడు ఉండేవాడు. నేను యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్న‌ప్పుడు శిరీష్‌ను అప్పుడ‌ప్పుడు క‌లిశాను. అప్పుడు త‌ను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. త‌ను సినిమా బిజినెస్ గురించి చాలా మంచి ఆర్టిక‌ల్స్ రాసేవాడు. ప్రొడ‌క్ష‌న్‌లో అర‌వింద్‌కి మంచి స‌క్సెస‌ర్ దొరికాడ‌ని అనుకున్నాను. క‌ట్ చేస్తే త‌ను యాక్ట‌ర్ అయిపోయాడు. త‌న‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌. త‌న కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్ చేసిన శిరీష్‌, త‌న స్టార్ డ‌మ్‌కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ద‌ర్శ‌కుడు సంజీవ్‌కి ఆల్ ది వెరీ బెస్ట్‌. రుక్స‌ర్ మంచి పెర్ఫామ‌ర్‌. త‌న‌కు కూడా ఆల్ ది వెరీ బెస్ట్‌.

ABCD movie pre-release

అల్లు శిరీష్ మాట్లాడుతూ “ఈ సినిమాను తెలుగులో చేయ‌మ‌ని చెప్పింది నా క‌జిన్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. రెండేళ్ల క్రితం ఎలాంటి సినిమా చేస్తే బావుంటుంద‌నే డిస్క‌ష‌న్ వ‌చ్చింది. అప్పుడు రాంచ‌ర‌ణ్ ఏబీసీడీ సీడీ తెచ్చి ఇచ్చి ఈ క్యారెక్ట‌ర్ నీకు క‌రెక్ట్‌గా సూట్ అవుతుంది అని చెప్పాడు. స‌రేన‌ని చూశాను. నాకు కూడా సినిమా బాగుంది క‌దా! అనిపించింది. అయితే మంచి డైరెక్ట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ హౌస్ దొరక‌డానికి స‌మ‌య ప‌ట్టింది. ఈ సినిమాను చూస్తున్న‌ప్పుడు నాకు నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను చూస్తున్న‌ట్లు అనిపించింది. రియ‌ల్ లైఫ్ తండ్రి కొడుకులను తెర‌పై చూస్తున్న‌ట్లుగా అనిపించింది. మా నాన్న‌ కూడా గుర్తుకు వచ్చి రెండు, మూడు సార్లు న‌వ్వుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో హీరో డ‌బ్బు విలువ తెలియ‌కుండా పాడైపోయాడ‌ని భావించిన తండ్రి అత‌న్ని బాగు చేసుకోవ‌డానికి ఏం చేశాడ‌నేదే క‌థ‌.

నాకు 21 ఏళ్లు వ‌చ్చింది. బ‌న్నికి, రామ్‌చ‌ర‌ణ్‌కు 21 ఏళ్లు వ‌చ్చిన‌ప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వ‌చ్చాయి కారు కొనివ్వ‌మ‌ని అడిగాను. ఏ కారు కావాలని నాన్న అన్నారు. మంచి స్పోర్ట్స్ కారు కావాల‌ని అన్నాను. ఆయ‌న చెప్పు ఇచ్చుకుని కొడ‌తాను. ఎందుకంటే నీ వ‌య‌సువాళ్లు ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వ‌డ‌మే ల‌గ్జ‌రీ. అలాంటిది స్పోర్ట్స్ కారు కొనివ్వ‌మ‌ని అడుగుతున్నావ్ అన్నారు. నాకు కారు కొనివ్వ‌లేదు. నీ కారు బ‌డ్జెట్ ఇంత అనుకుంటున్నాను అని అన్నారు. ఆ రోజు కోపానికి పోయి, నాకు కారు వ‌ద్దులే. నా స్వంత డ‌బ్బుల‌తోనే కొనుక్కుంటానని అన్నాను. అయితే నేను ఆ కారు కొన‌డానికి నాకు మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది.

ABCD movie pre-release

నాకు అప్పుడు నాన్న చేసిన పని వ‌ల్ల డ‌బ్బు విలువ తెలిసి వ‌చ్చింది. కాబ‌ట్టి ఈ సినిమాను మా నాన్న‌కు డేడికేట్ చేస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్ పేరు అర‌వింద ప్ర‌సాద్‌. మా నాన్న ఇన్‌స్పిరేష‌న్‌తోనే ఆ పేరు పెట్టుకున్నాను. ఎన్నారై యువ‌కుడైన నేను ఇండియాకు వ‌చ్చిన‌ప్పుడు డ‌బ్బులు లేకుండా ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాన‌నేదే సినిమా. నాకు ముంబైలో చ‌దువుకున్న రోజులు గుర్తుకు వ‌చ్చాయి. చాలా ఎంజాయ్ చేస్తూ క్యారెక్ట‌ర్ చేశాను. సంజీవ్ మ‌ల‌యాళం నుండి చ‌క్క‌గా అడాప్ట్ చేశాడు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ చ‌క్క‌టి విజువ‌ల్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జుడా సాండి .. నాకు ఈ జర్నీలో త‌ను మంచి మిత్రుడ‌య్యాడు.

అలాగే మ‌ధుర శ్రీధ‌ర్‌, య‌ష్ రంగినేని, ధీర‌జ్ మొగిలినేని అంద‌రూ చ‌క్క‌టి స‌పోర్ట్ అందించారు. నా కోస్టార్ భ‌ర‌త్ చాలా మంచి పాత్ర చేశాడు. మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేష‌న్ హిట్ కాంబినేష‌న్ అవుతుంది. ఈ సినిమాలో నాగ‌బాబు నా తండ్రి పాత్ర పోషించారు. నా తండ్రి పాత్ర‌లో నాగ‌బాబు త‌ప్ప మ‌రెవ‌రినీ ఊహించుకోలేను. బివిఎస్ ర‌వి, స‌త్యానంద్‌, కృష్ణ‌చైత‌న్య‌, ప‌వ‌న్ సాధినేనికి థాంక్స్‌.. రుక్స‌ర్ గ్లామ‌ర్‌తోనే కాదు.. పెర్ఫామెన్స్‌తో కూడా మెప్పిస్తుంది. స‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌“ అన్నారు.

- Advertisement -