నాని ‘V’నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌..!

192
nani

ఇంద్రగంటి మోహనకృష్ణ – నాని కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘V’.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్, అతిథి రావు హైదరి సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

అందుకే దీనికి సరికొత్తగా ‘V’ అనే టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంబంధించి పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు.

nani v

ఇక హీరోగా దూసుకుపోతున్న నానీ, విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసమేనని అనుకున్నారు. కానీ ఈ పాత్రకి సంబంధించిన ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందట. అది క్లైమాక్స్ లో రివీల్ అవుతుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ పాత్రను చేయడానికి నాని అంగీకరించాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా ఈ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచే విషయమే. ఇక ఈ సినిమా మార్చి 25వ తేదీన విడుదల కానుంది.