నాని…టక్ జగదీష్ అప్‌డేట్స్..!

147
nani

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం `ట‌క్‌…జ‌గ‌దీష్‌` .నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. `నిన్నుకోరి` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కొత్త లుక్‌తో కనిపించనుండటంతో పాటు నాని క్యారెక్టరైజేషన్ లో చాల వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో నాని పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తోందట. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నానితో ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు.