బాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న నాని మూవీ..

113

నాని హీరోగా నటించిన చిత్రం `జెర్సీ`. క్రీడా నేపథ్యంతో ఆద్యంతం రక్తి కట్టించే కథనంతో తీర్చిదిద్దిన చిత్రమిది. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. గ్యారెంటీ హిట్ కొడతానని చెప్పి మరీ నాని జెర్సీతో విజయం అందుకున్నాడు. ఆరంభం డివైడ్ టాక్ వచ్చినా ఒడిదుడుకుల్ని తట్టుకుని లాంగ్ డ్రైవ్ లో పెట్టుబడుల్ని రికవరీ చేయగలగింది. ఇక ఈ చిత్రంలో నాని నటన.. గౌతమ్ దర్శకత్వ ప్రతిభకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కురిసాయి.

Nani

అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయాట. ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ .. మనసును తాకే ఎమోషన్స్ ను తనలో కలుపుకున్న కథ. అందువలన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని భావించిన కరణ్ జొహార్, రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ దర్శకత్వం చేయమన్నట్టుగా సమాచారం. నాని పాత్రలో షాహిద్ కపూర్ ను ఎంపిక చేయనున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని అంటున్నారు.