కొడుకుకి సారీ చెప్పిన నాని.. ఎందుకో తెలుసా?

286
nani Arjun
- Advertisement -

న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం జెర్సీ.. మళ్లీరావా ఫేం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈచిత్రానికి దర్శకత్వం వహంచాడు. శ్రధ్దా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈసినిమా ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈచిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇటివలే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పూర్తి చేసుకున్నారు.

ఈసినిమా ట్రైలర్, టీజర్ విడుదల తర్వాత మూవీ పై అంచనాలు భారీగా పెరిపోయాయి. ఈసినిమాలో నాని క్రికెటర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. మూవీలో నాని పేరు అర్జున్. నాని కుమారుడి పేరు కూడా అర్జున్ కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.. తాజాగా నాని తన ట్వీట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. మా డాడి నాపేరు దొంగిలించాడు అని రాసి ఉన్న టీ షర్ట్ ను వేసుకున్నాడు అర్జున్.

పక్కనే కూర్చున్న నాని తన టీషర్ట్ పై అర్జున్ 36 అని రాసుంది. ఈ ఫోటోకు ‘సారీ రా జున్ను తప్పలేదు’ అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్ అర్జున్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈసినిమాపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు.

- Advertisement -