జూలై 11న నాని…’నిన్ను కోరి’..!

190
Nani Ninnu Kori Releasedate Confirmed
- Advertisement -

వైవిధ్యభరితమైన చిత్రాలు .. వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని. నేను లోకల్ అందించిన విజయంతో ఆనందంలో మునిగితేలుతున్న ఈ హీరో నిన్ను కోరి అంటూ ముందుకువస్తున్నాడు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలె అమెరికాలో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక  ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రధానపాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతు. జూలై 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

నాని సరసన నివేథా థామస్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రని ఆది పినిశెట్టి పోషిస్తున్నారు. మురళీశర్మ, తనికెళ్ళ భరణి, ప థ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం: శివ నిర్వాణ.

- Advertisement -