“వి” కోసం థాయ్ లాండ్ కు నాని

387
Nani V Movie
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈమూవీతో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అన్ని ప్రాంతాల నుంచి ఈసినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆర్ఎక్స్ 100హీరో కార్తికేయ ఈసినిమాలో విలన్ గా నటించాడు.

ఇక నాని తన తర్వాతి చిత్రం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఈసినిమాకు వి అనే టైటిల్ ను ఖరారు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈసినిమా తెరకెక్కనుంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈమూవీలో నాని -సుధీర్ బాబులు ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ థాయ్ లాండ్ లో జరుగుతుంది. సుధీర్ బాబుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రకరిస్తున్నారు. త్వరలోనే నాని అక్కడ జరుగుతోన్న షూటింగులో జాయిన్ కానున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, నివేదా థామస్ .. అదితీరావు హైదరి కథానాయికలుగా కనిపించనున్నారు. ఈమూవీని వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -