“గ్యాంగ్ లీడర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

436
Nani

నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కింది. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. 14రీల్స్ బ్యానర్ ఈసినిమాను నిర్మించింది. ఇటివలే ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈటీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈమూవీని సెప్టెంబర్ 13న గ్రాండ్ విడుదల చేయనున్నారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు నిర్మాతలు. రేపు సాయంత్రం వైజాగ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైజాగ్ లోని ‘గురజాడ కళాక్షేత్రం’లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను జరపనున్నారు. పూర్తిగా వినోదభరితంగా తెరకెక్కిన ఈచిత్రంలో నాని రైటర్ గా కనిపించనున్నాడు. జెర్సీ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని ఈసినిమా కూడా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు.