ఆకాశం ఉరుముతోంది…గ్యాంగ్ లీడర్ ట్రైలర్

331
nani

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న చిత్రం ‘నాని గ్యాంగ్ లీడర్’. ఇప్పటికే విడుదలైన టీజర్,సాంగ్స్,ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలు పెరిగిపోగా తాజాగా విడుదలకు ఒకరోజు ముందు మరో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఒక దుర్మార్గుడికి చావు దగ్గరపడుతున్న టైంలో వాతావరణం ఇలా గంభీరంగా మారిపోతుంది. ఆకాశం ఉరుముతుంది..సముద్రం పొంగుతుంది…గురక వినపడుతోంది…ఛీ గురకెంటీ అంటూ ఓన్లీ నాని వాయిస్‌తో విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక‌, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి..