నెహ్రూ బయోపిక్‌లో నందమూరి హీరో..

84
Nandamuri Taraka Ratna

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూ గా నటిస్తున్నారు. “దేవినేని” టైటిల్ తో బెజవాడ సింహం అన్న ట్యాగ్ లైన్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై దేవినేని నెహ్రూ బయోపిక్ గా తీస్తొన్న ఈ సినిమాకు రాము రాథోడ్ నిర్మాత. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి, సీనియ‌ర్ ఆర్టిస్ట్ జ‌మున కెమెరాస్విచాన్ చేయ‌గా సీనియ‌ర్ పాత్రికేయులు వినాయ‌క‌రావుగారు ఫ‌స్ట్ షాట్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Nandamuri Taraka Ratna

ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు శివ‌నాగు మాట్లాడుతూ… ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నంద‌మూరి తార‌క్‌ పోషించ‌గా మిగ‌తా ప్ర‌ధాన పాత్ర‌ల్లో పెద్ద ఆర్టిస్టులు న‌టిస్తున్నారు. నేను ఈ సినిమా చేద్దాం అనుకునే ముందు విజ‌య‌వాడ మొత్తం తిరిగి అంద‌ర్నీ క‌లిసి తెలుసుకున్నాను. గ‌తంలో ఒక‌సారి ఈ క‌థ గురించి నెహ్రూని కూడా క‌లిశాను. కానీ ఆయ‌న అప్పుడు ఎందుకు శివా అన‌వ‌స‌రంగా కాంట్ర‌వ‌ర్సీ చేస్తున్నారు. మీకు ఇంత‌కు మించిన క‌థ‌లు లేవా అని అన్నారు. కానీ నేను అలా కాదు నేను మీరు నాయ‌కుడుగా ఎన్నో మంచి ప‌నులు చేశారు వాటి గురించి చాలా మందికి తెలియ‌డం కోసం చేస్తున్నాను అని అన్నాను. ఒక‌సారి క‌థ చెప్పాను ఆయ‌న‌కు విని ఓకే చెయ్య‌మ‌న్నారు. ఆ త‌రువాత అనుకోకుండా ఆయ‌న చ‌నిపోవ‌డం జ‌రిగింది. త‌ర్వాత తార‌క్‌కి ఈ క‌థ చెప్ప‌గానే ఓకే అన్నారు. అని కొన్ని మార్పులు చెప్పారు. న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చిన మా జ‌మున‌మ్మ‌కి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు. మార్పు చేసి చెప్ప‌గానే ఓకే అన్నారు. మే 10నుంచి రెగుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ద‌స‌రాకి విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నాం. ఈ క‌థ 1977లోని క‌థ‌. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ అనుకుంటున్నాం అని అన్నారు.

Nandamuri Taraka Ratna

హీరో తార‌క్ మాట్లాడుతూ… మా ఫ్యామిలీకి ఎంతో స‌న్నిహితులైన వ్య‌క్తి. పెద‌నాన్న‌ లాంటివారు. ఆయ‌న పాత్ర పోషించ‌డం చాలా ఆనందంగా ఉంది. ద‌ర్శ‌కులు శివ‌నాగు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర‌లేదు. ఆయ‌న ఎన్నో మంచి చిత్రాల‌ను తీశారు. ఈ సినిమాకి రాము లాంటి మంచి ప్రొడ్యూస‌ర్ దొర‌క‌డం మా అదృష్టం. ఈ సినిమా మంచి హిట్ అయి ప్రొడ్యూస‌ర్‌కి బాగా డ‌బ్బులు రావాల‌ని కోరుకుంటున్నాను. మా అమ్మ జ‌మున చేతుల మీదుగా ఈ సినిమా రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.