మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నందమూరి హీరో

410
Kalyan Ram
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ 118 సినిమాతో చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ నందమూరి హీరో. ప్రస్తుతం ఆయన తుగ్లక్ హిస్టారికల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి వరకూ చేరుకుంది. ఈసినిమా తర్వాత కళ్యాణ్ రామ్ విరించి వర్మ తో సినిమా చేయనున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా ఈసినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. అయితే కళ్యాణ్ రామ్ తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. దర్శకుడు సంపత్ నంది ఇటివలే కళ్యాణ్ రామ్ కు కథ వినిపించాడట. స్టోరీ నచ్చడంతో పూర్తి స్క్రీప్ట్ ను రెడీ చేయమని చెప్పాడట.

మొదట గోపిచంద్ తో చేద్దామనుకున్నా అతను బిజీగా ఉండటంతో కళ్యాణ్ రామ్ కు చెప్పేశాడట. ఫుల్ యాక్షన్ డ్రామా గా కొనసాగే ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ కాస్త నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని సమాచారం. ఈసినిమాకు సంబంధించిన పూర్తీ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -